కాకినాడ జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని పార్టీ జిల్లాధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్‌కు అందించారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కాకినాడ జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని కోరారు. రాష్ట్ర నేత మాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.