గత 10 రోజులుగా వర్షాలు అధికంగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులు ఉండాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. అనపర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నియోజకవర్గంలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఆసుపత్రిలో మందులు, వసతులు, గ్రామాల్లో పారిశుధ్యం పై అధికారులతో సమీక్ష జరిపారు.