అనపర్తిలో కెనాల్ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

57చూసినవారు
అనపర్తి లో కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు మరమ్మతు పనులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారిని నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల మరమ్మతులు చేపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్