పెదపూడి మండలం దోమడ గ్రామ సచివాలయం వద్ద మన పంచాయతీ మన సాధికారత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సర్పంచ్ మినవల్లి శారదా, సచివాలయం సెక్రెటరీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. టిడిపి నాయకులు దొరబ్బాయి మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ సహకరించాలని గ్రామశాఖ అధ్యక్షులు కోరారు.