దోమడలో ఇది మంచి ప్రభుత్వం
పెదపూడి మండలం దోమడ గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు గ్రామశాఖ అధ్యక్షులు కాకర్ల గోవిందు, మద్దిపూడి దొరబ్బాయి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కూటమి నాయకులు సవరపు చిట్టిబాబు, సచివాలయం సిబ్బంది తో కలిసి శనివారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజులు నుంచి ఏం చేసిందో ప్రజలకు వివరించారు. ఇంటింటికి కరపత్రాలు అందించి స్టిక్కర్లు అంటించారు.