నల్లజర్ల: ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించిన మద్దిపాటి

77చూసినవారు
నల్లజర్ల: ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించిన మద్దిపాటి
గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతూ మహిళా సాధికారత సాధించే దిశగా "పార్డ్ ఇండియా" స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు తెలిపారు. సోమవారం నల్లజర్లలో "పవర్ ఆఫ్ సూవింగ్" పేరిట నిర్వహించిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. శిక్షణ ద్వారా మహిళలు ఆర్థికంగా తమ కుటుంబాలను సైతం పోషించుకునే అద్భుత అవకాశమన్నారు.

సంబంధిత పోస్ట్