దేవరపల్లిలో అఖిలాంధ్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కరుటూరి ఫంక్షన్ హాల్ వరకు కోలాహలంగా యాత్ర జరిగింది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో దేవరపల్లిలో అఖిలాంధ్ర సాధు పరిషత్ 60వ మహాసభలు జరుగుతున్నాయి. సభలకు ఉభయ తెలుగు రాష్ట్రల నుంచి 300 మంది పీఠాధిపతులు, సాధువులు హాజరవుతున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు.