‘సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రతీ పోలీసు అధికారికి అవగాహన ముఖ్యమని, లోన్ యాప్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసే విధంగా వాటిపై ప్రచారం సాగించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపెండింగ్ అట్రాసిటీ కేసులు, మహిళలకు సంబంధించిన కేసులు, మిస్సింగ్ కేసులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు.