ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, వాహనచోదకులు అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడతాయని ట్రాఫిక్ సిఐ కృష్ణ అన్నారు. శుక్రవారం కాకినాడలో పిఆర్ కాలేజీలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది అవగాహనా లోపం, అధిక వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదమన్నారు.