పిడిఎఫ్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపిమూర్తినామినేషన్ వేశారు. భీమవరం నుంచి బయలుదేరిన ర్యాలీ కాకినాడ చేరుకుంది. కాకినాడలో మంగళవారం బాలాజీ సెంటర్లో ఎమ్మెల్సీ అభ్యర్థి కిగోపిమూర్తి టీచర్లు వామపక్ష నాయకులు ఘన స్వాగతం పలికారు. బాలాజీ సెంటర్ నుండి భారీ ఊరీగంతో జిల్లా కలెక్టరేట్ లో గోపిమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై తన పోరాటం చేస్తానని పేర్కొన్నారు.