కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన చాగంటి
ముఖ్యమంత్రి చంద్రబాబుని సచివాలయంలో సోమవారం రాత్రి ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు కలిశారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. అనంతరం చాగంటి కోటేశ్వరావుని సీఎం శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు.