కాకినాడ: నాటు సారాపై ఉక్కు పాదం: ఎక్సైజ్ సీఐ

76చూసినవారు
నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నట్లు కాకినాడ నార్త్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రామ మోహన్ రావు తెలియజేశారు. గురువారం సాయంత్రం ఆయన సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నార్త్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఏ విధమైన నాటుసారా రవాణా తయారీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా గురువారం ఐదు లీటర్ల నాటుసారాతో ఓ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు రామమోహన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్