కాకినాడ రూరల్ మండలంలోని రాయుడుపాలెంలో శ్రీ ఉమా మనోవికాస కేంద్రం వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు సమకూర్చిన ఉచిత పరికరాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బుధవారం అందజేశారు. 70 మంది దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, కృత్రిమ కాళ్లు, చెవిటి మిషన్లు అందించామని ఉమా మనోవికాస కేంద్రం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.