కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో గురువారం జరిగిన మహా కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల్లో రామాయణం రాసిన ఆ మహా కవయిత్రికి నిండు మనసుతో నమస్కరిస్తున్నా అని తెలిపారు. రామాయణం చదవడానికి నెలలు పడుతుందని, అలాంటిది ఆమె ఐదు రోజుల్లో రాయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కొనియాడారు.