కళాశాలల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలనిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమీషన్ సభ్యులు వడిత్యా సోమ శంకర్ నాయక్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జెఎన్టియుకె కాకినాడ యూనివర్శిటీ ఇన్ ఛార్జ్ ఉపకులపతి ప్రొ. కెవిఎస్. మురళీకృష్ణ అధికారులతో విసి కాన్ఫరెన్స్ హాలు నందు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. యూనివర్శిటీలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.