కాకినాడ: ఆరోగ్య శ్రీలో రూ.25లక్షల వరకూ ఉచిత వైద్యం: మంత్రి
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25లక్షల వరకూ వైద్య సాయం అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. శుక్రవారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. వైసీపీ పెట్టిన రూ.2వేల కోట్ల బకాయిలు తమ ప్రభుత్వం తీర్చిందన్నారు. ఈ ఏడాది రూ.4వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.