
కాకినాడ రూరల్: సముద్ర తాబేళ్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
సముద్ర తాబేళ్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్. ఎస్. ఆర్ వరప్రసాద్ అన్నారు. కాకినాడ రూరల్ లో మంగళవారం సాయంత్రం హోప్ ఐలాండ్ నందు వన్యప్రాణి సంరక్షణ విభాగం కోరంగి రేంజ్ ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్లు పిల్లలు సముద్రం లోకి విడుదల కార్యక్రమాన్ని బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.