డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సెక్షన్లో ఏపీ ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కెవి వి సుబ్రహ్మణ్య నాయుడు కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. లైన్ ఇన్స్పెక్టర్ గా ఆయన చేస్తున్న సేవలను గుర్తించి రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ట్రాన్స్కో ఎస్ ఈ తిలక్ చేతుల మీదుగా సుబ్రహ్మణ్యం నాయుడుకు ఉత్తమ సేవా పురస్కారం ప్రశంసా పత్రాన్ని అందజేశారు.