కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, మట్టి దోపిడీని అరికట్టకపోతే జనసేన పార్టీ తరఫున తీవ్ర ఉద్యమం చేయాల్సి వస్తుందని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ బండారు శ్రీనివాసరావు హెచ్చరించారు. మండల పరిధిలోని వాడపాలెం గ్రామంలోని ఆయన స్వగృహంలో సోమవారం మాట్లాడుతూ ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. ఇసుక అక్రమ తరలింపు విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.