నన్నయ యూనివర్సిటీ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో కొత్తపేట విద్యార్థిని ఆర్. బేబీ సత్యవాణి చేసిన నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటవి కె వి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బేబీ సత్యవాణి బీకాం చదువుతోంది. సత్యవాణి నృత్య ప్రదర్శనను చూసిన వైస్ ఛాన్స్ లర్ దుస్సాలువ తోసత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.