ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సూపర్వైజర్లు, సేల్స్ మాన్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రభుత్వ మద్యం షాపు వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీ విధానం ద్వారా తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నామని వాపోయారు. ఈ మేరకు మండల వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల షట్టర్లు డౌన్ చేసి నిరసన వ్యక్తం చేశారు.