కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు, రావులపాలెం మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శనివారం పార్టీ అధ్యక్షులుమెర్ల గోపాలస్వామి, గుత్తుల పట్టాభిరామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్ పాల్గొన్నారు.