గాంధీ ఆశం మేరకు ప్రతీ ఒక్కరూ స్వచ్చందంగా పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని గ్రామ సర్పంచ్ ఉన్నమట్ల మనశ్శాంతి అన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా చాగల్లు గ్రామపంచాయతీ వద్ద నిర్వహించిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా గ్రామ సభకు అధ్యక్షత వహించారు. 15 రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలను గ్రామ సభ్యులు తీర్మానించారు.