అమరావతిలోని అసెంబ్లీలో సోమవారం రాష్ట్ర మొదటి వార్షిక బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ హాజరయ్యారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబులు బడ్జెట్ ప్రతులను చదువుతూ కనిపించారు.