ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వాఖ్యలు చిన్న పిల్లాడి మాటల్లా వున్నాయని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండిపడ్డారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు తనకంటే ఒక్క ఓటు వచ్చినా రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని బహిరంగంగా ప్రజలు ముందు ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇప్పుడు మాట వెనక్కు తీసుకున్నారన్నారు.