గురుపౌర్ణమి వేడుకలను ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ పోలవరం, తాళ్ళరేవు మండలాల్లో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. షిర్డిసాయి ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. ముమ్మిడివరంలోని సాయిబాబా మందిరం వద్ద ఉదయం రాకాడ హారతి, మధ్యాహ్న హారతి, సాయంత్రం సంధ్యా హారతి, రాత్రి సేజ్ హారతి నిర్వహించారు. భారీ అన్నసమారాధన నిర్వహించారు. భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.