ఐ. పోలవరం: వీరేశ్వర స్వామి వెండి, బంగారు వస్తువుల తనిఖీ

56చూసినవారు
ఐ. పోలవరం మండలంలోని మురమళ్ల గ్రామంలో ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మొక్కుబడుల హుండీల ద్వారా భక్తులు సమర్పించిన వెండి, బంగారు వస్తువులను దేవాదయ శాఖ జ్యువెలరీ తనిఖీ అధికారి విల్ల వీర పళ్లంరాజు మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు స్వామి దేవస్థానంకు సంబంధించి 133 వెండి వస్తువులు, 82 బంగారు వస్తువులు ఉన్నట్లు తనిఖీ చేశామన్నారు. స్థానిక దేవాదాయశాఖ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.