కాట్రేనికోన మండలం, కందికుప్పలో భూముల రీ సర్వేపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీవో కె. మాధవి పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే రీ సర్వేలో పరిష్కరిస్తామని రైతులందరూ సంయుక్తంగా రీ సర్వే జరిగే కార్యక్రమంలో పాలుపంచుకుని సహకరించాలని ఆర్డీవో సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సునీల్ కుమార్ ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది, నాయకులు, రైతులు పాల్గొన్నారు.