మామిడికుదురు: అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షం

63చూసినవారు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో మామిడికుదురులో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. ఉదయం నుంచి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నప్పటికీ వర్షం కురవలేదు. రాత్రి అయ్యే సరికి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మండల పరిధిలోని పలు గ్రామాలలో పంట పనులపై ఉంది. పలుచోట్ల కుప్పనూర్చిన ధాన్యం కళ్లాల్లోనే ఉండిపోయింది.

సంబంధిత పోస్ట్