ముమ్మిడివరంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 వరకు రెండు గంటలపాటు ఎండతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముమ్మిడివరంలోని బళ్లగేటు సెంటర్, కుమ్మర్లవీధి, ఆసుపత్రి వీధి, కొండాలమ్మచింత, మార్కెట్ ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది.