వన్యప్రాణుల పరిరక్షణ అందరి బాధ్యత: ఎమ్మెల్యే దాట్ల

51చూసినవారు
వన్యప్రాణులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు ముగింపు సందర్భంగా తాళ్లరేవు మండలం చొల్లంగిలోని పర్యాటక కేంద్రంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్ అటవీ శాఖ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్