నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తేమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం గరగోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 15న ప్రారంభమైన తిరునాళ్లు గురువారం రాత్రితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోలాటాలు, వివిధ రకాల నృత్యాలతో భారీ ఎత్తున సాగుతుంది. ఈ వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు.