నిడదవోలు నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మంగళవారం తెలిపారు. రానున్న నూతన సంవత్సరంలో ప్రజలంతా మంచి ఆయురారోగ్యాలతో జీవించాలని సంక్రాంతి మంచి క్రాంతి కావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పెరవలి మండలం అన్నవరప్పాడు వెంకటేశ్వర స్వామి ఆలయ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.