పాఠశాల విద్యార్థులచే స్వచ్ఛత కార్యక్రమాలు

53చూసినవారు
స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలలో భాగంగా.. గురువారం సామర్లకోట పట్టణ పరిధిలో ఉన్న నాలుగు ఉన్నత పాఠశాలల విద్యార్థులచే చెత్త నుంచి సంపద తయారీలో భాగంగా పలు అకృతులు తయారుచేసి ప్రదర్శించారు. హెచ్ ఎం. తోటకూర సాయి రామకృష్ణ ఆధ్వర్యంలో నాలుగు పాఠశాల విద్యార్థులు చేసిన ఆకృతులను సందర్శించిన మునిసిపల్ కమీషనర్ శ్రీ విద్య అభినందించారు. కౌన్సిలర్ బలుసు వాసు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్