పెద్దాపురం మండలం కాండ్రకోట-తూర్పు పాకల మధ్య ఏలేరు దబ్బ కాలువ పై తాత్కాలిక వంతెన నిర్మాణ పనులకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప శుక్రవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇటీవల ఏలేరు కాలువకు ఏర్పడిన భారీ వరదల నేపథ్యంలో వంతెన కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. పలుగ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులతో తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే ఎస్ఈ మూర్తితో కలిసి శ్రీకారం చుట్టారు.