పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయం నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్-2025 ప్రశాంతంగా ముగిసింది. శనివారం నిర్వహించిన ఈ పరీక్షలో 8,971 మందికి గాను 6,499 మంది హాజరయ్యారన్నారు. మొత్తం 72.44 శాతం హాజరయ్యారని ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ కాటా రామకృష్ణయ్య తెలిపారు. ఈ పరీక్ష రాసిన వారిలో 80 మందిని సీబీఎస్ఈ సహాయంతో నవోదయ విద్యాలయ సమితి ఎంపిక చేస్తుందన్నారు.