పెద్దాపురంలో జరుగుతున్న 13వ జాతీయస్థాయి స్కూల్ చదరంగ ఛాంపియన్ షిప్-2025 పోటీలు రెండో రోజు శనివారం హోరాహోరీగా కొనసాగాయి. ఈ పోటీలను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆర్బిటర్స్ కమిషన్ ఛైర్మన్ ఆర్ రాజేశ్ పర్యవేక్షించారు. 26 రాష్ట్రాలకు చెందిన 1200 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలు పాఠశాలలో ఎనిమిది హాల్స్ లో నిర్వహించారు.