పెద్దాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా
గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప అన్నారు. శనివారం సామర్లకోటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకూ తన హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని, 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందన్నారు. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానన్నారు.