పిఠాపురం: జనసేన ఫ్లెక్సీలను తొలగించారని ఆందోళన

76చూసినవారు
పిఠాపురం పట్టణంలో పలుచోట్ల ఉన్న జనసేన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం తొలగించారు. దీనితో మిగతా ఫ్లెక్సీలను ఉంచి కేవలం జనసేన ఫ్లెక్సీలను తొలగించారని స్థానిక జనసేన నాయకులు మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు. జనసేన నాయకులకు మున్సిపల్ అధికారులు సమాచారం ఇవ్వకుండా తొలగించడం ఏమిటంటూ ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న జనసేన నాయకులతో పోలీసులు చర్చించడంతో ఆందోళన విరమించారు.

సంబంధిత పోస్ట్