కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రుల సందర్భంగా సత్యదేవా కాలనీవాసులు అమ్మవారికి సారి బుధవారం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులకు మా కాలనీ తరఫున అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యదేవ కాలనీ వాసులు పాల్గొన్నారు.