తూర్పుగోదావరి జిల్లాలో రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీం ద్వారా అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలోని 53 స్టేషన్లను ఎంపిక చేయగా, జిల్లాలోని పలు స్టేషన్లు కూడా ప్రాజెక్టులో చోటు పొందాయి. రాజమండ్రి స్టేషన్‌కు రూ. 214 కోట్లు, కాకినాడ జంక్షన్‌కు రూ. 21 కోట్లు, సామర్లకోట స్టేషన్‌కు రూ. 15.13 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. పనులన్నీ పూర్తయ్యాక రాజమండ్రి స్టేషన్‌కి కొత్త రూపం వస్తుందని సమాచారం.