ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూ. గో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఎంఈవోలు వారి పరిధిలోని ప్రతిపాదనలను ఈనెల 29లోగా మండల, డివిజనల్ కమిటీ ఆమోదంతో కార్యాలయానికి పంపించాలన్నారు. ఉపాధ్యాయులు వారి దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా సంబంధిత అధికారులకు ఇవ్వాలన్నారు. అర్హులు గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.