తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా న్యూఢిల్లీ ఏపీ భవన్‌లో అడిషనల్ రెసిడెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న షిమాంశు కౌషిక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ జేసీగా విధులు నిర్వహిస్తున్న తేజ్ భరత్‌ను కడప మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ బదిలీ చేసింది.