రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్‌గా అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కేతన్ గార్జ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ కమిషనర్‌గా వ్యవహరించిన దినేష్‌కుమార్ ను గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేసారు.