ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు, యువతులపై అత్యాచారాలు, దాడులు పెరిగాయని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద మండిపడ్డారు. శనివారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలపై అఘాయిత్యాలు, విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ వినియోగంతో రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగాయన్నారు. ప్రభుత్వం వీటిని నియంత్రించేలా చర్యలు చేపట్టకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.