రాజమండ్రి: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: మాజీ ఎంపీ

85చూసినవారు
రాజమండ్రి: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: మాజీ ఎంపీ
అధికారులు, ప్రస్తుత పాలకుల వ్యవహార తీరు చూస్తుంటే ప్రజల విలువైన ప్రాణాలతో ఆటలాడుకుంటున్నట్టు ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మాజీ ఎంపీ భరత్ పరిశీలించి మాట్లాడారు. మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు.

సంబంధిత పోస్ట్