రాజమండ్రి: ప్రజా సమస్యలకు నాణ్యతతో కూడిన పరిష్కారం

73చూసినవారు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజలు సమస్యలపై అందించే అర్జీలకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ ఖర్గ్ తెలిపారు. సోమవారం రాజమండ్రి నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాల్గొని సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలపై 21 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్