రాష్ట్రంలోని శెట్టిబలిజలు ఆర్థికంగా బలపడేలా కృషిచేస్తానని రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమం, ఆ సంస్థ ఛైర్మన్ గా నియమితులైన కుడుపూడి సత్తిబాబు చెప్పారు. శెట్టి బలిజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం రాజమండ్రి పట్టణ కేంద్రం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చారని ఆయన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు.