రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది.ఫెర్టిలైజర్స్ షాపుల యజమానులు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు.