కడియం మండలం కడియపులంక గ్రామంలోని శ్రీ హరి హర మహా క్షేత్రం నందు కొలవైయున్న శ్రీ అపర్ణాదేవి (16వ) శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మూడవరోజు శనివారం 'గాయత్రి దేవి' అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.